Indo-China: యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?: జిన్‌పింగ్
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్మీ సిబ్బందితో మాట్లాడారు. యుద్ధ సన్నద్ధతపై వారిని ప్రశ్నించారు.
బీజింగ్: భారత్- చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో డ్రాగన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)తో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ‘యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?’అని ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. పీఎల్ఏ ప్రధాన కార్యాలయం నుంచి ఆర్మీ జవాన్లతో జిన్‌పింగ్ మాట్లాడుతూ..యుద్ధ సన్నద్ధతపై వారిని ప్రశ్నించినట్లు అక్కడి అధికార మీడియా వెల్లడించింది. సరిహద్దులో పరిస్థితుల గురించి ఆరా తీసినట్లు తెలిపింది. ఇటీవల కాలంలో సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, దానివల్ల ఆర్మీకి ఎదురవుతున్న సవాళ్లను అధ్యక్షుడు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
సరిహద్దు ప్రాంతాన్ని 24 గంటల పాటు కంటికి రెప్పలా కాపాడుతున్నామని, కట్టుదిట్టంగా భద్రతను పర్యవేక్షిస్తున్నామని ఆర్మీ జవాన్లు జిన్‌పింగ్‌కు చెప్పినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అత్యంత క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లను జిన్‌పింగ్ అభినందించారు. తాజా ఆహారపదార్థాలు అందుతున్నాయో లేదోనని వాకబు చేశారు. వారందరినీ సరిహద్దు రక్షకులుగా అభివర్ణించిన ఆయన.. వారిలో నూతన ఉత్తేజం కలిగేలా మాట్లాడారు. 2020, మే 5న లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో హింసాత్మక ఘటన చోటు చేసుకున్న తర్వాత ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య 17 సార్లు అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. ఓ వైపు తమ బలగాలను వెనక్కి తీసుకుంటున్నామని డ్రాగన్ చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. చైనాతో ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంతత అవసరమని నొక్కి చెబుతూనే.. ప్రత్యర్థి ఎత్తుగడలను అంచనా వేస్తూ భారత్ కూడా తమ దళాలను మోహరిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Movies News
Social Look: వేదిక అలా.. మౌనీరాయ్ ఇలా.. శ్రద్ధాకపూర్?
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!