Ship Hijack: నౌకను ఎలా హైజాక్‌ చేశారో వీడియో విడుదల చేసిన హౌతీ రెబెల్స్‌

హౌతీ రెబెల్స్‌ కార్గో షిప్‌ను హైజాక్‌ చేశారు. దీనికి సంబంధించి వీడియోను విడుదల చేశారు. 

Updated : 21 Nov 2023 06:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తుర్కియే(Turkey) నుంచి భారత్‌(India)కు వస్తున్న ‘గెలాక్సీ లీడర్‌’(Galaxy Leader) కార్గో షిప్‌(cargo Ship) హైజాక్‌(Hijack) అయిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌(Israel)కు చెందిన ఈ నౌకను నడిసంద్రంలో హౌతీ రెబెల్స్‌ హైజాక్‌ చేసి యెమెన్‌ తీర ప్రాంతానికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను హౌతీ రెబెల్స్‌ తాజాగా విడుదల చేశారు. సదరు కార్గో షిప్‌ను ఎలా హైజాక్‌ చేశారో వీడియోలో స్పష్టంగా ఉంది. హెలికాప్టర్‌లో వచ్చిన సాయుధులు ఓడ డెక్‌పై దిగారు. అనంతరం స్లోగన్స్‌ చేస్తూ, గాలిలో కాల్పులు జరుపుతూ అక్కడున్నవారిని తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఓడను పూర్తిగా తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొడుతోంది. 

హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇప్పటికే హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈనేపథ్యంలోనే నౌకను హైజాక్‌ చేశారు. అయితే సదరు నౌకలో తమ దేశానికి చెందిన పౌరులు లేరని ఇజ్రాయెల్‌ ఇప్పటికే ప్రకటించింది. గెలాక్సీ లీడర్‌ నౌక ఇజ్రాయెల్‌ వ్యాపారికి చెందినప్పటికీ ప్రస్తుతం జపాన్‌కు చెందిన ఓ సంస్థ నిర్వహిస్తోందని అధికారులు గుర్తించారు. ఈ నౌకలో బల్గేరియా, ఫిలిప్పీన్స్‌, మెక్సికో, ఉక్రెయిన్‌కు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని