Americas Got Talent: ‘అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌’ షోలో అదరగొట్టిన భారత సంతతి బాలిక

ప్రఖ్యాత ‘అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌’ టీవీ షోలో భారత సంతతికి చెందిన ప్రణిస్కా మిశ్ర అనే బాలిక అదరగొట్టింది.

Updated : 09 Jul 2024 04:09 IST

న్యూయార్క్‌: ప్రఖ్యాత ‘అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌’ టీవీ షోలో భారత సంతతికి చెందిన ప్రణిస్కా మిశ్ర అనే బాలిక అదరగొట్టింది. తన అద్భుత గానంతో న్యాయ నిర్ణేతలు సహా అందరినీ మంత్రముగ్ధులను చేసి, గోల్డెన్‌ బజర్‌ను దక్కించుకుంది. ప్రణిస్కా వయసు తొమ్మిదేళ్లు. ఆమె కుటుంబం ప్రస్తుతం ఫ్లోరిడాలో స్థిరపడింది. ప్రణిస్కా ప్రతిభపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ఆమె సాధించిన విజయం స్ఫూర్తిదాయకమని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని