viral video: ఎనర్జీ డ్రింక్‌ ప్రచారం కోసం.. రూ.3 కోట్ల కారును ముక్కలు చేసి..!

తన ఉత్పత్తి ప్రచారం కోసం ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. అతడు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. 

Updated : 04 Mar 2023 18:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రచారం కోసం కొందరు వింత పోకడలకు పోతుంటారు. ఈ తరహాలోనే ఓ వ్యక్తి రూ.3.15 కోట్ల విలువైన కారు(car)ను ముక్కలు చేశాడు. ఇదంతా తన ఎనర్జీ డ్రింక్ ప్రచారం కోసమేనట. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

రష్యాకు చెందిన ఆ వ్యక్తి పేరు మిఖాయిల్ లిట్విన్‌. తన లిట్‌ ఎనర్జీ(Lit Energy)డ్రింక్‌కు ప్రచారం కల్పించేందుకు ఈ వింత ప్రయత్నం చేశారు. ఒక పెద్ద క్యాన్‌లో ఎనర్జీ డ్రింక్‌ను ఉంచి దానిని క్రేన్‌కు వేలాడదీశారు. కింద తెలుపు రంగు లంబోర్గిని( Lamborghini Urus)కారును ఉంచాడు. సరిగ్గా కారు మీద పడేలా ఏర్పాటు చేశాడు. కారుపై క్యాన్‌ను వదిలేయడంతో అది సెకన్లలో ముక్కలు ముక్కలు కావడం ఆ వీడియోలో కనిపించింది. ఇటీవల ఈ వీడియోను యూట్యూబ్‌, ఇన్‌స్టాలో షేర్ చేసి.. కారును మెచ్చుకుంటూ పోస్టుపెట్టాడు. ఇప్పుడది వైరల్‌ అవుతోంది. అయితే నెటిజన్లు అతడి చేష్టను తప్పుపడుతున్నారు. ‘నువ్వు వృథా చేసిన ఆ డబ్బుతో ఎన్నో ప్రాణాలు కాపాడుకోవచ్చు’, ‘ప్రజల దృష్టిని తమ ఉత్పత్తి వైపు మరల్చే విషయంలో ఎలాంటి విలువలను పాటించడం లేదు’ అని విమర్శించారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు