UkraineCrisis: రష్యా లేజర్లు.. నాజీల వండర్‌ వెపన్స్‌ లాంటివే..!

ఉక్రెయిన్‌ డ్రోన్లను కుప్పకూల్చేందుకు లేజర్‌ ఆయుధాలు వినియోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ.. వాటిని నాజీలు ఉపయోగించిన

Published : 21 May 2022 02:11 IST

వెక్కిరించిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ డ్రోన్లను కుప్పకూల్చేందుకు లేజర్‌ ఆయుధాలు వినియోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ.. వాటిని నాజీలు ఉపయోగించిన వండర్‌ ఆయుధాలతో పోల్చి ఎద్దేవా చేశారు. ‘‘వారు ఈ యుద్ధంలో చేసేదేమీ లేదని తేలిపోయింది. అందుకే వారి వండర్‌ వెపన్‌ లేజర్‌ ఆయుధం గురించి ప్రచారం చేసుకొంటున్నారు. వారు దురాక్రమణలో విఫలమయ్యారని అర్థమైపోతోంది’’ అని ఆయన ఎద్దేవా చేశారు. 

ఇటీవల రష్యా డిప్యూటీ ప్రధాని యూరీ బోరిసోవ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘‘సరికొత్త డైరెక్టెడ్‌ ఎనర్జీ ఆయుధం జదిర లక్ష్యాలను 5 కిలోమీటర్ల దూరంలోనే ధ్వంసం చేస్తుంది. పరీక్షా సమయంలో డ్రోన్లను 5 సెకన్లలోనే కూల్చింది’’ అని తెలిపారు. దీనిని రష్యా దళాలు ఉక్రెయిన్‌లోని యుద్ధ రంగానికి తరలించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 

ప్రపంచ వ్యాప్తంగా పలు సైనిక దళాలు ఇప్పటికే లేజర్‌ ఆయుధాల వినియోగంపై పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా డ్రోన్లు కూల్చేందుకు వీటిని వినియోగించాలని భావిస్తున్నాయి. గత నెలలో ఇజ్రాయిల్‌ లేజర్‌ ఆయుధాన్ని అభివృద్ధి చేసిందని ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్‌ స్వయంగా వెల్లడించారు. దానిని ఆయన ‘ఐరన్‌ బీమ్‌’గా అభివర్ణించారు. ‘ఇదేదో సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా అనిపిస్తుంది.. కానీ, ఇది నిజం’’ అని బెన్నెట్‌ ట్వీట్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని