Zelensky: ఉక్రెయిన్‌పై ఇరాన్‌ డ్రోన్లు.. రష్యా దివాలా తీసిందా..?

ఉక్రెయిన్‌ చేతికి చౌకగా తయారయ్యే స్విచ్‌ బ్లేడ్‌ డ్రోన్లు రావడంతో.. రష్యా కూడా చౌక ఆయుధాలపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ తయారీ షహీద్ సిరీస్‌ డ్రోన్లను క్రెమ్లిన్‌ ఎంచుకొంది.

Published : 20 Oct 2022 01:37 IST

కీవ్‌: ఉక్రెయిన్-రష్యా యుద్ధం అనేక మలుపులు తీసుకుంటోంది. సైనికంగా బలమైన రష్యా.. కారు చౌక ఆయుధాలతో దాడులు చేస్తోంది. ఇరాన్‌ నుంచి చౌకగా డ్రోన్లను దిగుమతి చేసుకొని ఉక్రెయిన్‌పై ఎక్కుపెడుతోంది. దీనిని ఉద్దేశించి అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. పుతిన్‌ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సైనికంగా, రాజకీయంగా క్రెమ్లిన్ దివాలా తీసిందనడానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. 

‘ఇరాన్‌ ఆయుధాలపై రష్యా ఆధారపడుతోంది. ఇది తాను రాజకీయంగా, సైనికంగా దివాలా తీసానని క్రెమ్లిన్‌ గుర్తించడం కిందికే వస్తుంది. వాటి వాడకం వ్యూహాత్మకంగా వారికి ఏమాత్రం ఉపకరించదు. ఇంకా చెప్పాలంటే.. రష్యా ఓటమికి దగ్గరవుతుందని ప్రపంచానికి రుజువు చేయడమే అవుతుంది. దీనికి కచ్చితంగా స్పందన ఉంటుంది’ అని జెలెన్‌స్కీ వ్యాఖ్యలు చేశారు. 

ఉక్రెయిన్‌ చేతికి చౌకగా తయారయ్యే స్విచ్‌ బ్లేడ్‌ డ్రోన్లు రావడంతో.. రష్యా కూడా చౌక ఆయుధాలపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ తయారీ షహీద్ సిరీస్‌ డ్రోన్లను క్రెమ్లిన్‌ ఎంచుకొంది. మరోవైపు ఇరాన్‌ మాత్రం రష్యాకు ఎటువంటి ఆయుధాలను సరఫరా చేయడం లేదని చెబుతోంది. కానీ, డ్రోన్ల భాగాలపై ఇరాన్‌ తయారీ చిహ్నాలను ఉక్రెయిన్‌ అధికారులు గుర్తించారు. పుతిన్‌ సైన్యం ఇరాన్‌ డ్రోన్లను వాడుతుందని ఉక్రెయిన్‌, పశ్చిమ దేశాలు ఆరోపిస్తుండగా.. తమ సైన్యం అటువంటి ఆయుధాలు వాడుతున్నట్లు తమకు తెలియదని క్రెమ్లిన్‌ వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని