Zelensky: మీ మద్దతు.. మా మొహంలో చిరునవ్వును తెస్తుంది..!

యుద్ధంలో మగ్గిపోతోన్న ఉక్రెయిన్‌కు పలు దేశాలు ఆసరాగా నిలుస్తున్నాయి. ఆహారం, ఔషధాలు వంటి అత్యవసర సేవలు అందిస్తూ, ఆదుకుంటున్నాయి.

Updated : 10 May 2022 15:36 IST

యూకే బాలుడి లేఖకు స్పందించిన జెలెన్‌స్కీ

లండన్‌: యుద్ధంలో మగ్గిపోతోన్న ఉక్రెయిన్‌కు పలు దేశాలు ఆసరాగా నిలుస్తున్నాయి. ఆహారం, ఔషధాలు వంటి అత్యవసర సేవలు అందిస్తూ, ఆదుకుంటున్నాయి. ఈ తరహాలో యూకేకు చెందిన ఓ పాఠశాల కూడా తనవంతుగా కొంత సామగ్రిని అందించింది. అప్పుడే ఆ పాఠశాలకు చెందిన 12 ఏళ్ల కుర్రాడు థామస్‌.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి లేఖ రాసి, సామగ్రితో పాటుగా పంపించాడు. అయితే, యుద్ధంలో తలమునకలై ఉన్న జెలెన్‌స్కీ ఆ లేఖకు సమాధానం ఇవ్వడం ఆ బాలుడిని ఆశ్చర్యపర్చింది. ఆ లేఖను చూసి, మహా సంబరపడిపోయాడు. దానికి సంబంధించి వివరాలను అక్కడి విద్యాశాఖ వెల్లడించింది. 

జెలెన్‌స్కీని ఉత్తమ అధ్యక్షుడు అని పేర్కొంటూ, ఉక్రెయిన్‌కు సహాయం చేయడం పట్ల సంతోషంగా ఉందని థామస్‌ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖను పోలండ్‌లోని శరణార్థులు గుర్తించి, అధ్యక్షుడికి పంపారు. ‘ప్రియమైన థామస్‌. నీ లేఖ ద్వారా మాకు మద్దతు ప్రకటించినందుకు ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. ఉక్రెయిన్‌లో తిరిగి మామూలు పరిస్థితి రావాలని మేం కోరుకుంటున్నాం. లేఖలో నువ్వు చెప్పిన మాటలు, యూకే మద్దతు మా అందరి మొహంలో చిరునవ్వును తీసుకువస్తుంది’ అంటూ జెలెన్‌స్కీ ఆ లేఖకు సమాధానం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని