Updated : 12 Mar 2022 10:30 IST

Ukraine Crisis: మేయర్‌ను కిడ్నాప్‌ చేసిన రష్యా సేనలు.. వీడియోలో రికార్డ్‌

కొనసాగుతోన్న బాంబుల మోత

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న దండయాత్ర రోజురోజుకీ మరింత తీవ్రమవుతోంది. రాజధాని కీవ్‌పై ముప్పేట దాడికి రష్యా సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కీవ్‌ నలువైపులా భారీ ఎత్తున బలగాలను మోహరిస్తున్నాయి. ఇదే సమయంలో ఇతర నగరాలపైనా బాంబులతో విరుచుకుపడుతున్నాయి. దక్షిణ ఉక్రెయిన్‌లోని మెలిటొపోల్‌ను అధీనంలోకి తీసుకున్న రష్యా సైనికులు.. శుక్రవారం ఆ నగర మేయర్‌ను కిడ్నాప్‌ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో బయటకు వచ్చాయి.

ఆయుధాలతో వచ్చిన కొంతమంది మెలిటొపోల్‌ మేయర్‌ ఇవాన్‌ ఫెడోరోవ్‌ను బలవంతంగా తీసుకెళ్తున్న వీడియోను ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయం డిప్యూటీ హెడ్‌ కిరిల్‌ తిమోషెంకో సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. శత్రు సైనికులకు సహకరించట్లేదని అయనను అపహరించినట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. ఈ కిడ్నాప్‌ను అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ధ్రువీకరించారు. ‘‘రష్యా ఉగ్రవాదం కొత్త దశలోకి మారింది. చట్టబద్ధ ప్రతినిధులపై భౌతిక దాడులకు పాల్పడుతోంది. ఈ చర్యలు ఐసిస్‌ ఉగ్రవాదుల కంటే తక్కువేం కాదు’’ అని జెలెన్‌స్కీ మండిపడ్డారు. మెలిటొపోల్‌ నగరాన్ని ఫిబ్రవరి 26నే రష్యా హస్తగతం చేసుకుంది. 

ప్రతి 30 నిమిషాలకు దాడులు..

మరోవైపు రాజధాని కీవ్‌ను అధీనంలోకి తీసుకునేందుకు రష్యా సేనలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. కీవ్‌పై భారీ బాంబులతో విరుచుకుపడుతున్నాయి. పేలుడు శబ్దాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటు మరియుపోల్‌లోనూ పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. గత 11 రోజులుగా మరియుపోల్‌ వ్యాప్తంగా విద్యుత్‌, నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రతి 30 నిమిషాలకోసారి ఫిరంగుల దాడులు జరుగుతున్నాయని నగర మేయర్‌ తెలిపారు. ఇప్పటికే 1200 మంది మరణించి ఉంటారని ఆయన అంచనా వేశారు.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని