china: బీజింగ్‌, షాంఘైల్లో జీరో కొవిడ్‌ లక్ష్యం సాధించిన చైనా

చైనాలోని అతిపెద్ద నగరాలైన బీజింగ్‌, షాంఘైల్లో ఎట్టకేలకు సోమవారం ఎటువంటి కొవిడ్‌ కేసులు నమోదు కాలేదు. ఇందుకు కోసం

Updated : 28 Jun 2022 12:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాలోని అతిపెద్ద నగరాలైన బీజింగ్‌, షాంఘైల్లో ఎట్టకేలకు సోమవారం ఎలాంటి కొవిడ్‌ కేసులు నమోదు కాలేదు. జీరో కోవిడ్‌ లక్ష్యంగా అక్కడి అధికారులు.. ఫిబ్రవరి 19 నుంచి నాలుగు నెలల పాటు కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్‌లు అమలు చేశారు. ఇక చైనాలో దేశ వ్యాప్తంగా కూడా కొవిడ్‌ కేసులు తగ్గి కేవలం 22 మాత్రమే నమోదైనట్లు అక్కడి జాతీయ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది.

చైనా ఈ ఘనత సాధించేందుకు భారీ మూల్యమే చెల్లించింది. చివరిసారిగా షాంఘైలో ఫిబ్రవరి 23న ఎలాంటి సామాజిక వ్యాప్తి కనిపించలేదు. కానీ, ఆ తర్వాత నుంచి రెండు నెలల పాటు 25 మిలియన్ల మందిని కఠిన లాక్‌డౌన్‌లో ఉంచారు. దీంతోపాటు నిర్దేశించిన ఆంక్షలు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, రోజువారీ పరీక్షలను తీవ్రం చేశారు.

ఇక బీజింగ్‌లో చివరిసారి ఏప్రిల్‌ 16వ తేదీన జీరో కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా కేసుల సంఖ్య పెరగడంతో కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. తాజాగా కొవిడ్‌ తీవ్రత తగ్గడంతో సోమవారం నుంచి విద్యార్థులు పాఠశాలలకు వెళుతున్నారు. ఇక్కడి వారు ఎక్కడికి వెళ్లినా.. సెల్‌ఫోన్‌లోని సంబంధిత యాప్‌లో గ్రీన్‌ కోడ్‌ను చూపాలి. అంతేకాదు.. ఏదైనా బహిరంగ ప్రదేశాలకు వెళితే ప్రతి మూడు రోజులకోసారి కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. మూడేళ్లు దాటిన పిల్లలు పార్కులో ఆడుకోవాలన్నా.. కొవిడ్‌ పరీక్షలు తప్పనిసరి. మరోవైపు చైనా టెక్‌ నగరమైన షెన్‌జెన్‌లో మాత్రం ఇంకా కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని