Published : 06 Jul 2022 15:10 IST

Zimbabwe: త్వరలో బంగారు నాణేలు ముద్రించనున్న జింబాబ్వే..!

ఇంటర్నెట్‌డెస్క్‌: భయంకరమైన ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్న జింబాబ్వే ఓ సంచలన నిర్ణయం తీసుకొంది. ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు ఏకంగా బంగారు నాణేలను ముద్రించాలని నిర్ణయించింది. దీంతోపాటు వచ్చే ఐదేళ్లలో అమెరికా డాలర్‌ను కరెన్సీగా వాడాలనే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం 190శాతాన్ని మించిపోవడంతో ఇటీవల అక్కడి కేంద్ర బ్యాంక్‌ వడ్డీ రేట్లను రెండు రెట్లు పెంచింది. మరో వైపు జింబాబ్వే డాలర్‌ విలువ గణనీయంగా పతనమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం పలు నిర్ణయాలను ప్రకటించింది. 

జులై 25వ తేదీ నుంచి 22క్యారెట్ల స్వచ్ఛతతో కూడిన ఒక ట్రాయ్‌ ఔన్స్‌ బరువున్న బంగారు నాణేలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ జింబాబ్వే గవర్నర్‌ జాన్‌ పి ముంగుడి ప్రకటించారు. ఒక ట్రాయ్‌ ఔన్స్‌ 31.10 గ్రాముల బరువు తూగుతుంది. ఈ కొలతను బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాల కొలతకు వినియోగిస్తారు. ‘‘ఈ నాణేలను స్థానిక కరెన్సీ, అమెరికా డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీలను వినియోగించి కొనుగోలు చేయవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర, తయారీ ఖర్చు కలుపుకొని ఉంటుంది’’ అని జాన్‌ పి ముంగుడి వెల్లడించారు. దీనిలో ప్రతి కాయిన్‌కు సీరియల్‌ నెంబర్‌ ఉంటుంది. దీనిని తేలిగ్గా నగదులోకి మార్చుకొనే అవకాశం లభిస్తుంది. దీనిని ‘మోసి ఓ తున్యా గోల్డ్‌ కాయిన్‌’గా పిలుస్తారు. దేశంలో నగదు సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని