76 ఏళ్ల వయసులోనూ ‘సోషల్ మీడియా స్టార్’ అవుతోంది!
‘ఆసక్తి, అభిరుచి ఉంటే ఏ పని చేయడానికైనా వయసుతో నిమిత్తం లేదు... మనిషి జీవితంలో వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే’.. ఈ మాటలను నిరూపిస్తూ ఎందరో మహిళలు లేటు వయసులో మనసుకు నచ్చిన పనులు చేస్తున్నారు. వయసు, ఎవరేమనుకుంటారోనన్న సందేహాలను పక్కన పెట్టి ఒకప్పుడు కోల్పోయిన అవకాశాలను తిరిగి సంపాదించి, నచ్చిన రంగంలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో మలి వయసులోనూ తమ కలలను సాకారం చేసుకుంటూ స్ఫూర్తినిస్తున్నారు. ఈ కోవకే చెందుతుంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన శాంతావర్మ.