Hansika Motwani: ఆ సమతుల్యత అవసరం
హన్సిక మోత్వానీ.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలూ, వెబ్‌సిరీస్‌లతో ఏడాది పొడవునా ఎంత బిజీగా ఉన్నా సరే! మధ్యలో చిన్న చిన్న హాలిడే ట్రిప్పులు మాత్రం ఉండాల్సిందేనట. చిరకాల మిత్రుడు సోహెల్ కథూరియాతో పెళ్లయ్యాక కూడా ఇందులో ఏ మాత్రం మార్పు లేదంటోంది.