PAK vs ENG: బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీ.. రెండోసారి టైటిల్ నెగ్గిన ఇంగ్లాండ్
పొట్టి కప్ విజేతగా ఇంగ్లాండ్ అవతరించింది. ఐదు వికెట్ల తేడాతో పాక్‌పై విజయం సాధించింది. బెన్‌స్టోక్స్ (52: 49 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్) కీలక ఇన్నింగ్స్‌కు తోడు జోస్ బట్లర్ (26), హ్యారీ బ్రూక్ (20), మొయిన్ అలీ (19) సహకరించడంతో పాక్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్య ఛేదనను ఇంగ్లాండ్ 19 ఓవర్లలోనే పూర్తి చేసింది. పాక్ బౌలర్లలో హారిస్ రవూఫ్ 2.. షహీన్, షాదాబ్, వాసిమ్ జూనియర్ తలో వికెట్ తీశారు. టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్ గెలుచుకోవడం ఇది రెండోసారి. గతంలో 2010 టైటిల్‌ను ఇంగ్లాండ్ సొంతం చేసుకొంది.