IND w Vs AUS w: 5 పరుగుల తేడాతో భారత్ ఓటమి.. ఫైనల్‌కు చేరిన ఆసీస్
మహిళల టీ20 ప్రపంచ కప్ (womens world cup 2023) ఫైనల్‌కు ఆస్ట్రేలియా దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో భారత్‌పై ఆసీస్ (IND w Vs AUS w) ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత ఆసీస్ 172/4 స్కోరు సాధించగా.. భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (52), జెమీమా రోడ్రిగ్స్ (43), దీప్తి శర్మ (20*) రాణించినా భారత్ విజయం సాధించలేకపోయింది. ఆసీస్ బౌలర్లు గార్డెనర్ 2, బ్రౌన్ 2.. జొనాసన్, స్కట్ చెరో వికెట్ తీశారు.