18+ వారందరికీ టీకా.. GHMCలో 100 కేంద్రాలు

తాజా వార్తలు

Updated : 03/07/2021 13:33 IST

18+ వారందరికీ టీకా.. GHMCలో 100 కేంద్రాలు

హైదరాబాద్‌: పద్దెనిమిది ఏళ్లు పైబడిన పౌరులందరికీ కొవిడ్‌ టీకాలు వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 100 కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టీకా సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా కరోనా టీకా వేస్తామన్నారు. కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని కేంద్రానికి వెళితే వేచి చూడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ప్రజలు తమ దగ్గర్లో ఉన్న కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని