గాంధీలో కొనసాగుతున్న జూడాల ధర్నా
close

తాజా వార్తలు

Updated : 10/06/2020 16:28 IST

గాంధీలో కొనసాగుతున్న జూడాల ధర్నా

హైదరాబాద్: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యుల (జూడాలు) ధర్నా కొనసాగుతోంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మృతిచెందాడంటూ గాంధీ ఆసుపత్రిలోని జూనియర్‌ వైద్యుడిపై మంగళవారం మృతుడి బంధువులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ నిన్న రాత్రి ఆస్పత్రి ముందు జూడాలు బైఠాయించారు. నిన్న రాత్రి 8.30 గంటల నుంచి 300 మంది జూనియర్‌ వైద్యులు విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు.

ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు జూనియర్‌ వైద్యులు ఇప్పటికే మంత్రి ఈటలను కలిశారు. విధుల్లో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా కొవిడ్‌ పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో జూనియర్‌ వైద్యులకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సంఘీభావం తెలిపింది. మరోవైపు జూనియర్‌ వైద్యుడిపై దాడికి సంబంధించి చిలకలగూడ పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని