TS News: ఔష‌ధ కొర‌తను అధిగ‌మిస్తాం: కిష‌న్‌రెడ్డి

తాజా వార్తలు

Published : 27/05/2021 11:09 IST

TS News: ఔష‌ధ కొర‌తను అధిగ‌మిస్తాం: కిష‌న్‌రెడ్డి

హైద‌రాబాద్‌: గ‌తంలో బ్లాక్ ఫంగ‌స్ కేసు ఆర్నెళ్ల‌కో, ఏడాదికో ఒక‌టి వ‌చ్చేద‌ని.. ఇప్పుడు కరోనా కార‌ణంగా భారీగా న‌మోద‌వుతున్నాయ‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. న‌గరంలోని కోఠి ఈఎన్‌టీ ఆస్ప‌త్రిని ఆయ‌న ఈ ఉద‌యం సంద‌ర్శించారు. బ్లాక్ ఫంగ‌స్ వార్డులో బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి అందుతున్న చికిత్స‌పై ఆయ‌న‌ ఆరా తీశారు.  డ‌యాబెటిస్ రోగుల్లో బ్లాక్ ఫంగ‌స్ ఎక్కువ‌గా వ‌స్తున్న‌ట్లు చెప్పారు. కొవిడ్ నుంచి కోలుకున్నాక బ్లాక్ ఫంగ‌స్ సోకుతున్న క్రమంలో బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించాలని కేంద్ర మంత్రి అధికారులకు సూచించారు.

బ్లాక్ ఫంగ‌స్ బాధితుల చికిత్స కోసం వాడే ఇంజ‌క్ష‌న్‌ల కొర‌త ఏర్ప‌డ‌టం వాస్తవ‌మ‌ని.. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి కేంద్ర‌, రాష్ట్ర ప‌భుత్వాలు యుద్ధ‌పాత్రిప‌దిక‌న ప‌ని చేస్తున్న‌ట్లు కిష‌న్‌రెడ్డి వివ‌రించారు. త్వ‌రలోనే ఈ ఔష‌ధ కొర‌త స‌మ‌స్య‌ను అధిగ‌మిస్తామ‌న్నారు. దేశంలోని 11 ఫార్మా కంపెనీల్లో ఈ ఇంజెక్ష‌న్ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు చెప్పారు. డిసెంబ‌రు 31 లోపు మూడు ల‌క్ష‌ల ఇంజ‌క్ష‌న్‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియ‌ర్ డాక్ట‌ర్లు స‌మ్మె చేస్తున్న నేప‌థ్యంలో కిషన్‌రెడ్డి స్పందించారు. వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే పరిష్క‌రించాల‌న్నారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని