హైదరాబాద్‌లో 54%మందిలో యాంటీబాడీలు 

తాజా వార్తలు

Updated : 04/03/2021 17:36 IST

హైదరాబాద్‌లో 54%మందిలో యాంటీబాడీలు 

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో 54శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నాయని సీసీఎంబీ ప్రకటించింది. 56శాతం మహిళలు, 53శాతం పురుషుల్లో యాంటీబాడీలు ఉన్నాయని తెలిపింది. యాంటీబాడీలు ఉన్న 75శాతం మందికి కరోనా వచ్చినట్టు కూడా తెలియలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. నగరంలోని 30 వార్డుల్లో తొమ్మిదివేల మంది నమూనాలు పరిశీలించినట్టు చెప్పారు. భారత్‌ బయోటెక్‌ - ఎన్‌ఐఎన్‌తో కలిసి సీరో సర్వే చేసినట్టు సీసీఎంబీ తెలిపింది.

మరోవైపు, తెలంగాణలో కొత్తగా 152 కొవిడ్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,99,406 మందికి వైరస్‌ సోకింది. వీరిలో 2,95,821 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 1637 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1948 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని