బ్లాక్‌ ఫంగస్‌.. ఒకరి పరిస్థితి విషమం
close

తాజా వార్తలు

Updated : 15/05/2021 05:20 IST

బ్లాక్‌ ఫంగస్‌.. ఒకరి పరిస్థితి విషమం

గాంధీ ఆసుపత్రి, గోదావరిఖని పట్టణం, న్యూస్‌టుడే: ఒకపక్క కరోనా జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుండగా మరోపక్క బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మూడు బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు తెలిపారు. ‘‘నగరంతోపాటు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ నుంచి వీరు వచ్చారు. ప్రత్యేక వైద్యబృందం చికిత్స అందిస్తోంది. మ్యూకోర్‌ మైకోసిస్‌(బ్లాక్‌ఫంగస్‌)ను గతంలో కూడా కొందరిలో గుర్తించాం. ఆ ఇన్‌ఫెక్షన్‌ను తొలగించడానికి మెరుగైన వైద్యం అందించాం. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో ఇది వేగంగా వ్యాపిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నాక మళ్లీ జ్వరం వస్తే అది బ్లాక్‌ ఫంగస్‌గా అనుమానించాలి’’ అని అన్నారు. శుక్రవారం ఆసుపత్రి గేటువద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
అలాగే పెద్దపల్లి జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం రేపుతోంది. రామగుండం ప్రాంతానికి చెందిన నలుగురు హైదరాబాద్‌, కరీంనగర్‌లలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ముగ్గురు కరోనా బారిన పడి గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యం పొందారు. మరొకరు ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కొద్ది రోజులకు దవడ నొప్పి, కళ్ల కింద నొప్పి, కనుగుడ్డు బయటకు వచ్చినట్లు లక్షణాలు కనిపించడంతో వారు హైదరాబాద్‌, కరీంనగర్‌ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. బాధితుల్లో ఇద్దరు వృద్ధులు, ఒకరు 45 ఏళ్ల వయసు, మరొకరు పాతికేళ్ల యువకుడు ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ప్రమోద్‌కుమార్‌ను వివరణ కోరగా.. ‘‘జిల్లాలో పలువురికి బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపించిన విషయం నా దృష్టికి రాలేదు. ఎక్కువగా మధుమేహ బాధితులకు, స్టిరాయిడ్స్‌ అధికంగా వాడిన వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి’’ అని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని