బ్లాక్‌ఫంగస్‌తో ఒకరి మృతి
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 05:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్లాక్‌ఫంగస్‌తో ఒకరి మృతి

అంజల్‌రెడ్డి

రామారెడ్డి, న్యూస్‌టుడే: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన వ్యక్తి బ్లాక్‌ ఫంగస్‌తో హైదరాబాద్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించారు. గురిజాల అంజల్‌రెడ్డి(42) గత నెల 23న కరోనా బారినపడ్డారు. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకొని మే 8న డిశ్చార్జి అయ్యారు. అనంతరం కన్ను ఎర్రబారి ఇబ్బందులు తలెత్తడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా సరోజినీదేవి కంటి ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. సరోజినీ వైద్యులు పరీక్షించి బ్లాక్‌ఫంగస్‌ సోకి ఉండొచ్చని భావించి కేర్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. మే 11న అంజల్‌రెడ్డి కేర్‌ ఆసుపత్రిలో చేశారు. బ్లాక్‌ఫంగస్‌ సోకినట్లు నిర్ధారించిన వైద్యులు ఆయనకు ఓ కన్ను, దవడ తొలగించారు. ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం రాత్రి మరణించినట్లు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని