Marriage: పెళ్లి చేసి.. పుస్తె దోచి..

తాజా వార్తలు

Updated : 19/05/2021 10:20 IST

Marriage: పెళ్లి చేసి.. పుస్తె దోచి..

రూ.1.50 లక్షల విలువైన గొలుసును చోరీ చేసిన పురోహితుడు


తూప్రాన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులు

తూప్రాన్‌, న్యూస్‌టుడే: పెళ్లి చేసేందుకు వచ్చిన పురోహితుడు అమ్మాయి మెడలో కట్టాల్సిన పుస్తెల తాడును కాస్తా తస్కరించిన ఘటన తూప్రాన్‌ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. తూప్రాన్‌ పురపాలిక పరిధి పడాలపల్లికి చెందిన మునిరాతి పెంటయ్య, సుశీల దంపతుల కుమారుడు జ్ఞానేందర్‌ దాస్‌కు నర్సాపూర్‌ మండలం గొల్లపల్లికి చెందిన వసంతతో ఈనెల 16న పడాలపల్లిలో వివాహం చేయ నిశ్చయించారు. వివాహం చేసేందుకు గజ్వేల్‌కు చెందిన పురోహితుడిని మాట్లాడుకోగా మండపంలో వధూవరులు, బంధువుల దృష్టిని మరల్చి మూడు తులాల బంగారు పుస్తెల తాడును అపహరించాడు. ఏదో పనున్నట్లు వివాహ మండపంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయకుండా హడావిడిగా వెళ్లిపోయాడు. ఆయన వెళ్లిన తర్వాత వధువు మెడలో బంగారు పుస్తెల తాడు లేకపోవడాన్ని గమనించిన కుటుంబసభ్యులు కంగుతిన్నారు. అదే రోజు పురోహితుడికి ఫోన్‌ చేసి ఆరా తీసేందుకు ప్రయత్నించగా చరవాణి స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. గజ్వేల్‌కు ఇంటికి వెళ్లగా ఆయన తల్లి పొంతన లేని సమాధానం ఇచ్చింది. దీంతో వారు మంగళవారం 11వ వార్డుకు చెందిన తెరాస నాయకుడు వెంకట్‌ గౌడ్‌తో కలిసి తూప్రాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. పెళ్లి చేసేందుకు వచ్చిన పురోహితుడు పుస్తెల తాడును అపహరించారనే సమాచారం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని