13 నుంచి సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్‌ క్యాంపు

తాజా వార్తలు

Updated : 12/06/2021 05:23 IST

13 నుంచి సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్‌ క్యాంపు

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రెండు వారాల్లోగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని సీఎండీ శ్రీధర్‌ ఆదేశించారు. ఇందుకోసం ఈ నెల 13 నుంచి మెగా వ్యాక్సినేషన్‌ క్యాంపు నిర్వహించాలని సూచించారు. సంస్థలో ఇప్పటికే 45 ఏళ్ల వయసు పైబడిన 16వేల మంది ఉద్యోగులకు, 14 వేల మంది ఉద్యోగుల కుటుంబీకులకు, 6వేల మంది విశ్రాంత ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ పూర్తయిందని తెలిపారు. మిగిలిన 29వేల మంది ఉద్యోగులకు తొలిడోసు అందించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. కరోనా నివారణ చర్యలపై శుక్రవారం ఆయన డైరెక్టర్లు, ఏరియా మేనేజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈమేరకు సీఎండీ సూచనలిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని