Cyber Crime: సగం ధరకే.. జీడిపప్పు.. బాదం!
close

తాజా వార్తలు

Updated : 20/06/2021 14:18 IST

Cyber Crime: సగం ధరకే.. జీడిపప్పు.. బాదం!

ఫేస్‌బుక్‌ వేదికగా మోసపూరిత ప్రకటనలు

రాజస్థాన్‌ సైబర్‌ నేరస్థుల నయా మోసం

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘జీడిపప్పు కిలో రూ.500లు...బాదం కిలో రూ.300లు..మీ ఫోన్‌ నంబర్‌.. చిరునామా చెబితే...రెండుగంటల్లో ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తా’’మంటూ సైబర్‌ నేరస్థులు ఫేస్‌బుక్‌లో ప్రకటనలు గుప్పిస్తున్నారు. వీటితోపాటు ఖర్జూరం, అవిసెగింజలు, తృణ ధాన్యాలను ఆకర్షణీయమైన కవర్లపై ముద్రించి యాభైశాతం రాయితీ ఇస్తాం. ఆర్డర్‌ చేసిన మొత్తంలో యాభైశాతం ముందుగా చెల్లిస్తే..రెండుగంటల్లో హోమ్‌ డెలివరీ ఇస్తామంటూ ప్రకటనలో పేర్కొంటున్నారు. కనీస ఆర్డర్‌ రెండువేలు అని చెప్పడంతో వందలమంది తమకు డ్రైఫ్రూట్స్‌ కావాలంటూ సైబర్‌ నేరస్థులకు ఫోన్‌ చేస్తున్నారు. వారు సూచించిన బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేయగానే.. ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు.  భరత్‌పూర్‌ సైబర్‌ నేరస్థులే ఈ మోసాలు చేస్తున్నారంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. ఫేస్‌బుక్‌, ఫేస్‌బుక్‌ మార్కెట్‌ ప్లేస్‌లో ప్రకటనలు పోస్ట్‌ చేస్తున్నవారిలో 95శాతం వీరే ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రముఖ బ్రాండ్లకు దీటుగా మెల్టింగ్‌ హార్ట్స్‌ పేరుతో విభిన్నమైన ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు. గతేడాది సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పుడు ఇంటికే మద్యం పంపిణీ చేస్తామంటూ ప్రముఖ మద్యం దుకాణాల పేర్లతో ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. మోసం నుంచి తప్పించుకోవాలంటే హోమ్‌ డెలివరీ ఇచ్చేటప్పుడే మొత్తం నగదు ఇస్తామంటూ నిందితులకు చెప్పాలని సూచించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని