మత్స్యకారుడి వలకు చిక్కిన అరుదైన మీనం

తాజా వార్తలు

Updated : 21/06/2021 06:15 IST

మత్స్యకారుడి వలకు చిక్కిన అరుదైన మీనం

మ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామ పరిధిలోని పాలేరు ఏటిలో అరుదైన మత్స్యం లభించింది. గ్రామానికి చెందిన చల్లగుండ్ల వెంకన్న ఆదివారం సమీప ఏటిలో చేపల వేటకు వెళ్లగా ఈ చేప చిక్కింది. దీనిని డెవిల్‌ ఫిష్‌, సక్కర్‌ మౌత్‌ ఫిష్‌గా పిలుస్తారని పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ విద్యాసాగర్‌ రెడ్డి తెలిపారు. అమెజాన్‌ సెయిల్‌ఫిన్‌ క్యాట్‌ఫిష్‌గానూ పిలిచే వీటి జన్మస్థలం దక్షిణ అమెరికాలోని అమెజాన్‌ నదీ పరివాహక ప్రాంతమన్నారు. సాధారణంగా అక్వేరియాల్లో పెంచే ఈ జాతి చేపలు వేగంగా పెరుగుతాయని, చేపల లార్వాలను తిని జీవిస్తాయన్నారు. గతేడాది అక్టోబరులో ఖమ్మం జిల్లా చిన్నమండవలోని మున్నేరులోనూ ఇలాంటి చేప లభించిందని, ఈ జాతి చేపలు తినేందుకు పనికిరావని చెప్పారు. 

- న్యూస్‌టుడే, నేలకొండపల్లి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని