Hyd: ఒకే బైక్‌పై 130 చలాన్లు

తాజా వార్తలు

Updated : 29/06/2021 08:11 IST

Hyd: ఒకే బైక్‌పై 130 చలాన్లు

వాహనం చలానాలు చూపుతున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన సంఘటనలో 130 చలాన్లు ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుపై జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో తనిఖీలు నిర్వహిస్తుండగా వెంకటగిరి వైపు నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 2 వైపు వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారును నిలిపారు. టీఎస్‌10 ఈఆర్‌ 7069 నెంబరున్న ఈ వాహనం చలాన్లు తనిఖీ చేశారు. 2017 నుంచి ఇప్పటివరకు 130 చలాన్లు ఉన్నాయి. అతి వేగం, రాంగ్‌ పార్కింగ్‌, శిరస్త్రాణం ధరించకపోవడం వంటి ఉల్లంఘనలున్నాయి. దీంతో ఎస్‌ఐ అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చలాన్ల మొత్తం రూ.35,950 చెల్లించాలని కోరగా వాహనదారు విజయ్‌ నిరాకరించారు. పోలీసులు హోండా యాక్టివాను స్వాధీనం చేసుకొన్నారు. వాహనదారు మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగి అని ఎస్‌ఐ చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని