కానరాని పిల్లి కోసం కళ్లలో ఒత్తులేసుకొని...

తాజా వార్తలు

Published : 30/07/2021 05:22 IST

కానరాని పిల్లి కోసం కళ్లలో ఒత్తులేసుకొని...

ఈనాడు డిజిటల్, హైదరాబాద్, రాయదుర్గం, న్యూస్‌టుడే: ‘‘మా పిల్లి జూన్‌ 24న ఓ ఆసుపత్రి నుంచి తప్పిపోయింది. అత్యవసరంగా వైద్యం చేయించా. సమాచారం ఇచ్చినవారికి రూ.50 వేలు బహుమతిగా ఇస్తాం’’ ఇదీ నెలరోజులుగా జూబ్లీహిల్స్‌ చుట్టుపక్కల గోడలపై, సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌ అవుతున్న విషయం. దీనిపై రాయదుర్గం ఠాణాలో కేసు కూడా నమోదైంది. ఓ పిల్లికి రూ.50వేల నజరానా అంటే ఏదో విదేశీ జాతి, అరుదైనదో అనుకుంటారంతా కానీ ఇదో సాధారణ వీధి పిల్లి. సికింద్రాబాద్‌కు చెందిన జంతు ప్రేమికుడు రూపేష్‌ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఇక్కడికొచ్చిన ఆయన ఓ వీధి పిల్లిని చేరదీసి దానికి ‘జింజర్‌’ అని పేరు పెట్టుకున్నారు. తను ఆస్ట్రేలియా తిరిగెళ్లాల్సి ఉండగా.. ముందు జాగ్రత్తగా జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు కేంద్రంలో ఈ పిల్లికి రూ.10వేల ఖర్చుతో కు.ని. శస్త్ర చికిత్స చేయించారు. వైద్యుల పర్యవేక్షణ కోసం ఆసుపత్రిలో ఉంచగా.. జూన్‌ 24న అక్కడి నుంచి పారిపోయింది. దాని ఆచూకీ కోసం రూపేష్‌ ప్రచారం మొదలుపెట్టడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది.  వైద్యులకు ఇది కేవలం ఓ పిల్లేనని.. మేం కుటుంబంలో ఒకటిగా చూసుకుంటున్నామని.. తిరిగి తెచ్చుకునేందుకు రూ.లక్ష అయినా ఖర్చు చేస్తానని రూపేష్‌ చెబుతున్నారు. జంతువుల విలువేంటో ప్రతి ఒక్కరికీ దీని ద్వారా తెలిసొస్తుందని రూపేష్‌ అంటున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని