Ts News: జులై 18న గురుకుల ప్రవేశపరీక్ష

తాజా వార్తలు

Published : 22/06/2021 17:51 IST

Ts News: జులై 18న గురుకుల ప్రవేశపరీక్ష

హైదరాబాద్: తెలంగాణలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. జులై 18న ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు చీఫ్ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. పరీక్షకు వారం రోజులు ముందు గురుకుల సొసైటీల వెబ్‌సైట్ల నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. మే 30న ప్రవేశ పరీక్ష నిర్వహించాలని భావించినప్పటికీ.. కరోనా తీవ్రత కారణంగా వాయిదా పడిందన్నారు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ఐదో తరగతి టీజీ సెట్ రాసేందుకు అర్హులన్నారు.

ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లోని ఐదో తరగతి సీట్లను భర్తీ చేయనున్నట్లు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. ఎస్సీ గురుకులాల్లో 18,560, గిరిజన గురుకులాల్లో 4,777, బీసీ గురుకులాల్లో 20,800, జనరల్ గురుకులాల్లో 2,800 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన వివరాలను గురుకులాల వెబ్‌సైట్లు లేదా 1800-425-45678 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ప్రవీణ్ కుమార్ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని