TS News : పాఠశాలల ప్రారంభంపై హైకోర్టు విచారణ

తాజా వార్తలు

Published : 23/06/2021 13:55 IST

TS News : పాఠశాలల ప్రారంభంపై హైకోర్టు విచారణ

హైదరాబాద్‌ : రాష్ట్రంలో జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో విచారణ  జరిగింది. పాఠశాలల ప్రారంభంపై కోర్టుకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇచ్చారు. అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని సందీప్ కుమార్ సుల్తానియా  తెలిపారు. విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ బోధన కూడా కొనసాగుతుందని వివరించారు. విద్యా సంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. అయితే  పాఠశాలల్లో భౌతికదూరం పాటించడం కష్టమని కోర్టు అభిప్రాయపడింది.  హైకోర్టు అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు ఖరారు చేస్తామని సుల్తానియా తెలిపారు. దీంతో వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యా శాఖను హైకోర్టు ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని