తెలంగాణలో మరో సంస్థ భారీ పెట్టుబడులు

తాజా వార్తలు

Updated : 09/07/2021 20:22 IST

తెలంగాణలో మరో సంస్థ భారీ పెట్టుబడులు

హైదరాబాద్: తెలంగాణలో టెక్స్ టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కేరళకు చెందిన కైటెక్స్ గ్రూపు ముందుకొచ్చింది. తొలి దశలో  రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాలపై కైటెక్స్ గ్రూపు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాయిబాబు, ప్రతినిథుల బృందం మంత్రి కేటీఆర్‌తో సమావేశమై చర్చించారు. దుస్తుల తయారీ రంగంలో పేరొందిన కైటెక్స్.. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పరిశ్రమలను నిర్వహిస్తోంది. పారిశ్రామిక అనుకూల విధానాలు, టెక్స్ టైల్ రంగంలో అపార అవకాశాలు ఉన్నందునే తెలంగాణను ఎంచుకున్నట్లు ఎండీ తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో దాదాపు 30 వేల ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నట్లు అంచనా.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా తెలంగాణలో రూ.20,761 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ గతంలో ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పెట్టుబడిని తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే పెద్దదిగా కేటీఆర్‌ ప్రకటించారు. ఎలక్ట్రిక్‌ వాహన తయారీ దిగ్గజ సంస్థ ట్రైటాన్‌.. తెలంగాణలో సుమారు రూ.2,100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. విద్యుత్‌ వాహనాల తయారీ ప్రణాళికలను పెద్ద ఎత్తున విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంస్థ తెలిపింది. తాజాగా మౌలిక వసతుల అభివృద్ధి సంస్థలైన కెనడాకు చెందిన ఇవాన్‌ హో కేంబ్రిడ్జ్‌, సింగపూర్‌కు చెందిన లైట్‌ హౌస్‌ కాంటన్‌ సంస్థలు ఉమ్మడి భాగస్వామ్యంలో తెలంగాణలో రూ.740 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇవాన్‌ హో 80 శాతం, లైట్‌హౌస్‌ కాంటన్‌ 20 శాతం జీవశాస్త్రాల మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెట్టనున్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని