ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహ నమూనా ఆవిష్కరణ

తాజా వార్తలు

Updated : 18/07/2021 11:03 IST

ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహ నమూనా ఆవిష్కరణ

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా (ఐదు తలలతో) దర్శనమివ్వనున్నారు. ఎడమ వైపు కాలనాగ దేవత, కుడివైపు కృష్ణ కాళి విగ్రహాలు (15 అడుగులు) ఏర్పాటు చేయనున్నారు. గణేశ్‌ ఉత్సవ విగ్రహ నమూనాను ఖైరతాబాద్‌లోని వినాయక మండపం వద్ద కమిటీ సభ్యులు శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ ఏడాది 40 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. గతేడాది కొవిడ్‌ నేపథ్యంలో 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని