Corona: బ్రహ్మాస్త్రంగా కాక్‌టెయిల్‌ యాంటీబాడీస్‌

తాజా వార్తలు

Published : 27/05/2021 18:53 IST

Corona: బ్రహ్మాస్త్రంగా కాక్‌టెయిల్‌ యాంటీబాడీస్‌

హైదరాబాద్‌‌: కొవిడ్‌ బాధితుల్లో మోనో క్లోనల్‌ యాంటీబాడీస్‌ ( కాక్‌ టెయిల్‌ యాంటీబాడీస్‌) బ్రహ్మాస్త్రంగా పని చేస్తున్నాయని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్‌ డా. నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. కాక్‌టెయిల్‌ యాంటీబాడీస్‌ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతిచ్చిందని ఆయన అన్నారు. పాజిటివ్‌ వచ్చిన మూడు రోజుల తర్వాత ఇంజక్షన్ రూపంలో ఐవీ క్యానల్‌ ద్వారా మోనో క్లోనల్‌ యాంటీబాడీస్‌ను ఎక్కిస్తారు. వైరస్‌కు ఉండే కొమ్ముల్లాంటి నిర్మాణాలు శరీరంలోని కణాలకు అతుక్కోకుండా ఈ యాంటీబాడీస్‌ అడ్డుకుంటాయని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 2 లక్షల డోసుల మోనో క్లోనల్‌ యాంటీబాడీస్‌ దిగుమతికి కేంద్రం అనుమతిచ్చిందని ఏఐజీ వెల్లడించింది. ఒక్కో ఇంజన్‌ ఖరీదు 60 వేల నుంచి 65 వేల వరకు ఉండే అవకాశముంది. అయితే ఒక్కో బాధితుడికి ఒక్కో డోసు సరిపోతుందని, డోసు తీసుకున్న వారంలో బాధితులు కరోనా నుంచి కోలుకుంటున్నారని ఏఐజీ తెలిపింది.

అయితే,  వెంటిలేటర్‌, ఆక్సిజన్‌పై ఉన్న కొవిడ్‌ బాధితులకు దీనిని ఉపయోగించకూడదని ఆయన అన్నారు. కొవిడ్‌ సోకిన మూడు రోజుల నుంచి వారం రోజుల్లో ఎక్కిస్తేనే ఫలితముంటుందని చెప్పారు. 65 సంవత్సరాలు పైబడిన వారు, అధిక షుగర్‌, కిడ్నీ వ్యాధులు, ఆస్తమా, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారికి ఈ ఇంజక్షన్‌ ఇవ్వడం వల్ల ప్రాణహాని తప్పుతుందని ఏఐజీ అంటోంది. ప్రస్తుతం ఏఐజీలో ఇండియన్‌ స్ట్రెయిన్‌ల మీద దీని సమర్థతను పరీక్షిస్తున్నామని, 70 శాతానికిపైగా సమర్థతను చూపిస్తోందని నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని