వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో దారుణం

తాజా వార్తలు

Updated : 09/07/2021 15:08 IST

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో దారుణం

హైదరాబాద్: వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన చిన్నారి మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. ఈ నెల 5న ఆస్పత్రిలో చేర్పించుకుని పురిటినొప్పులు వచ్చినప్పటికీ పట్టించుకోకుండా వైద్యులు నిర్లక్ష్యం చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల తర్వాత ఆపరేషన్‌ చేశారని, పుట్టిన బాబు ఉమ్మనీరు తాగి మృతి చెందినట్లు చెప్పారని మండిపడ్డారు. వైద్యులు సమయానికి ఆపరేషన్‌ చేయకుండా బాబు మృతికి కారణయ్యారని బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని