పోస్టాఫీసుల్లో పూర్తిస్థాయి పాస్‌పోర్టు సేవలు

తాజా వార్తలు

Updated : 26/06/2021 18:26 IST

పోస్టాఫీసుల్లో పూర్తిస్థాయి పాస్‌పోర్టు సేవలు

హైదరాబాద్‌: తెలంగాణలోని 14 తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టు సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు తపాలాశాఖ సహాయ సంచాలకులు రామకృష్ణ వెల్లడించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా తపాలా కార్యాలయాల్లో నిలిచిపోయిన పాస్‌పోర్టు సేవలు ఈ నెల 10 నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. వరంగల్‌ జిల్లాలోని హన్మకొండ, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, సిద్దిపేట, మెదక్‌, వికారాబాద్‌, మేడ్చల్‌, వనపర్తి, భువనగిరి, మహబూబాబాద్‌, కామారెడ్డి, అదిలాబాద్‌ జిల్లాల్లోని 14 ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తపాలా కార్యాలయాల ద్వారా 41,921 మందికి పాస్‌పోర్టు సేవలు అందించినట్లు రామకృష్ణ వెల్లడించారు. విద్యార్థులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారి సమయం, డబ్బు వృథా కాకుండా పత్రాల పరిశీలన జరుగుతోందన్నారు. స్లాట్స్‌ బుక్‌ చేసుకొని అన్ని ధ్రువపత్రాలతో తపాలా కార్యాలయాలకు వస్తే.. కొవిడ్‌ నిబంధనలు అనుసరించి పరిశీలన చేస్తామని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని