ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం..వైభవంగా బాలాపూర్‌ వినాయకుడి ఊరేగింపు

తాజా వార్తలు

Updated : 19/09/2021 10:50 IST

ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం..వైభవంగా బాలాపూర్‌ వినాయకుడి ఊరేగింపు


హైదరాబాద్‌: భాగ్యనగరం ఇవాళ పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనాలు జరగనున్నాయి. అందులో భాగంగా ప్రసిద్ధ ఖైరతాబాద్‌ వినాయకుడు శోభాయాత్ర ప్రారంభమైంది. వినాయకుడిని ట్రాలీపైకి ఎక్కించిన నిర్వహకులు కార్యక్రమాన్ని వైభవంగా మొదలుపెట్టారు. విజయవాడ నుంచి తెప్పించిన ప్రత్యేక ట్రాలీపై గణేశుడిని ఎక్కించి వెల్డింగ్‌ పనులను తెల్లవారుజామునే పూర్తి చేశారు. యాత్ర ప్రారంభం కావడంతో ఊరేగింపు రథంపై మహాగణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఈ శోభాయాత్ర హుస్సేన్‌సాగర్‌ వరకు 17 కి.మీ మేర జరగనుంది. ప్రత్యేక పూజల అనంతరం మహాగణపతి గంగ ఒడికి చేరనున్నాడు. క్రేన్‌ నంబర్‌ 4 వద్ద ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం జరగనుంది. నగరంలో పెద్ద ఎత్తున కొనసాగనున్న నిమజ్జనానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర కొనసాగే మార్గాలలో ట్రాఫిక్‌ మళ్లించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.

మరోవైపు బాలాపూర్‌ గణేశుడి ఊరేగింపు వైభవంగా కొనసాగుతోంది. భజన బృందం పాటలు, డప్పుచప్పుళ్ల సందడి నడుమ కార్యక్రమం ముందుకు సాగుతోంది. బాలాపూర్‌లోని ప్రధాన వీధుల్లో గణనాథుడిని ఊరేగిస్తున్నారు. ఊరేగింపు అనంతరం బాలాపూర్‌ ముఖ్య కూడలిలో లడ్డూ వేలంపాట నిర్వహించనున్నారు. 27 ఏళ్లుగా లడ్డూ వేలంపాట నిర్వహిస్తున్న ఉత్సవ సమితి యూనివర్సల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఏటా మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్న సుధాకర్‌కు ఇందులో చోటు దక్కింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని