Hyderabad news: నిజాం ఆస్తులకు హక్కుదారుడిని నేనే: దిల్షాద్‌ జా

తాజా వార్తలు

Published : 29/08/2021 17:36 IST

Hyderabad news: నిజాం ఆస్తులకు హక్కుదారుడిని నేనే: దిల్షాద్‌ జా

హైదరాబాద్‌: నిజాం ఆస్తులు అమ్ముతున్నాననే ఆరోపణల్లో వాస్తవం లేదని, నిజాం ఆస్తులకు అసలైన హక్కుదారుడిని తానేనని ఏడవ నిజాం మనవడు దిల్షాద్‌ జా తెలిపారు. నగరంలోని హైదర్‌గూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్షాద్‌ జా మాట్లాడుతూ... కిస్మాతపురలోని దర్గా హజ్రత్‌ ఖలీజ్‌ ఖాన్‌లో ఉన్న ఐదు ఎకరాల భూమికి పూర్తి హక్కుదారుడిని తానేనని స్పష్టం చేశారు. ఇటీవల నిజాం అకాఫ్‌ కమిటీ ... తాను ఈ స్థలాన్ని అమ్మేస్తున్నానని, ఆ కమిటీకి చెందిన సయ్యద్‌ ఖాద్రి ఫయీజ్‌ ఖాన్‌, ఫాయిజ్‌ జంగ్‌ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. నిజాంకు చెందిన ఆస్తులు 1984 నుంచి కాపాడుతున్నాని తెలిపారు. నిజాం అకాఫ్ కమిటీ అనేది అధికారిక కమిటీ కాదని, పూర్తి నిరాధారమైందన్నారు. ఈ స్థలానికి సంబంధించి పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, తనపై వస్తున్న ఆరోపణల విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని