GHMC: హైదరాబాద్‌ రోడ్లపై భవన వ్యర్థాలు వేస్తున్నారా.. అయితే జాగ్రత్త!

తాజా వార్తలు

Updated : 13/09/2021 15:39 IST

GHMC: హైదరాబాద్‌ రోడ్లపై భవన వ్యర్థాలు వేస్తున్నారా.. అయితే జాగ్రత్త!

హైదరాబాద్‌: హైదరాబాద్ నగర రహదారులపై ఇసుక, భవన వ్యర్థాలు వేస్తున్న వారిపై గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల టాలీవుడ్‌ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత రోడ్లపై వ్యర్థాలు వేసే వారిపై జీహెచ్‌ఎంసీ కఠినంగా వ్యవహరిస్తూ జరిమానాలు విధిస్తోంది. నగరంలోని మాదాపూర్ ఖానామెట్‌లో అరబిందో కన్‌స్ట్రక్షన్ కంపెనీకి జీహెచ్‌ఎంసీ అధికారులు రూ.లక్ష జరిమానా విధించారు. భవణ నిర్మాణాల సమయంలో రోడ్లపైకి చెత్త, ఇసుక, నిర్మాణ వ్యర్థాలు రాకుండా సంబంధిత నిర్మాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని