Harish rao: 32 జిల్లాలకు నిధులు విడుదల చేయండి: జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో హరీశ్‌రావు

తాజా వార్తలు

Published : 17/09/2021 20:13 IST

Harish rao: 32 జిల్లాలకు నిధులు విడుదల చేయండి: జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో హరీశ్‌రావు

హైదరాబాద్‌: రాష్ట్రానికి రావాల్సిన నిధులు వీలైనంత త్వరగా విడుదల చేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కోరారు. లఖ్‌ నవూలో జరిగిన జీఎస్టీ మండలి 45వ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈమేరకు కేంద్ర మంత్రికి లేఖ అందించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐజీఎస్టీ పరిహారంలో రాష్ట్రానికి రావాల్సిన రూ.210 కోట్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పది నుంచి 33కి పెరిగిన నేపథ్యంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను తొమ్మిది పాత జిల్లాలకు కాకుండా హైదరాబాద్‌ మినహా 32 జిల్లాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులను 2021-22 నుంచి మరో ఐదేళ్లు పొడిగించాలని కోరారు. 2019-20, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బీఆర్జీఎఫ్‌ నిధులు వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరారు. 2020-21కి సంబంధించి 15వ ఆర్థిక సంఘం గ్రాంటుగా సిఫారసు చేసిన రూ.723 కోట్లు ఇవ్వాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని