పిటిషన్‌ విత్‌డ్రాకు తెలంగాణకు అనుమతి ఇవ్వొద్దు.. సుప్రీంను కోరిన ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు

తాజా వార్తలు

Published : 27/08/2021 18:06 IST

పిటిషన్‌ విత్‌డ్రాకు తెలంగాణకు అనుమతి ఇవ్వొద్దు.. సుప్రీంను కోరిన ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు

దిల్లీ: కృష్ణా ట్రైబ్యునల్‌పై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విత్‌డ్రాకు అడ్డంకి ఏర్పడింది. 2015లో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ విత్‌డ్రా అనుమతి దరఖాస్తుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ పిటిషన్‌ విత్‌డ్రాకు అనుమతి ఇవ్వొద్దని ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు కోరాయి. సుప్రీం కోర్టు ద్వారానే సమస్య పరిష్కారం కావాలని ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు కోరుతున్నాయి. రెండు రాష్ట్రాలు వ్యతిరేకించడంతో పిటిషన్‌ను ధర్మాసనానికి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ధర్మాసనం వద్దే అనుమతి తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. దీంతో పిటిషన్‌ను ధర్మాసనం ముందుకు పంపుతామని ఛాంబర్‌ జడ్డి జస్టిస్‌ అనిరుధ్‌ బోస్‌ స్పష్టం చేశారు.

కృష్ణా ట్రైబ్యునల్‌ కొత్త బెంచ్‌ ఏర్పాటు చేయాలని 2014లో ఏపీ ప్రభుత్వం ఎల్ఎల్‌పీ వేసింది. ఏపీ విభజన తర్వాత ట్రైబ్యునల్‌ రెండు రాష్ట్రాలకే పరిమితం కావాలని.. ఇది నాలుగు రాష్ట్రాల మధ్య కొత్తగా తలెత్తిన వివాదం కాదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ వాదలను పరిగణనలోకి తీసుకోవాలని 2015లో తెలంగాణ రిట్‌ పిటిషన్‌ వేసింది. కొత్త ట్రైబ్యునల్‌, నీటి పంపకాల్లో తగిన నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొంది. దీంతో విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల అంశాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేశారు. సుప్రీంలో పిటిషన్‌ ఉండగా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది. అయితే పిటిషన్‌ ఉపసంహరణకు సిద్ధమని అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని