Flood: జంట జలాశయాలకు భారీ వరద.. మూసీలోకి నీటి విడుదల

తాజా వార్తలు

Published : 07/09/2021 12:39 IST

Flood: జంట జలాశయాలకు భారీ వరద.. మూసీలోకి నీటి విడుదల

హైదరాబాద్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నగరంలోని జంట జలాశయాలకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. హిమాయత్‌సాగర్‌ జలాశయంలోకి 750 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీని గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1762.10 అడుగులకు నీరు చేరింది. దీంతో రెండు గేట్ల ద్వారా మూసీలోకి  700 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఉస్మాన్ సాగర్ లోకి 1200 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ జలాశయ గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1789.35 అడుగులుగా ఉంది. జలాశయంలోని నాలుగు గేట్లు ఎత్తి మూసీలోకి 1800 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని