KTR: హైదరాబాద్‌ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. 31 ప్రాంతాల్లో కొత్త ఎస్టీపీలు

తాజా వార్తలు

Published : 23/09/2021 17:55 IST

KTR: హైదరాబాద్‌ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. 31 ప్రాంతాల్లో కొత్త ఎస్టీపీలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ విశ్వనగరంగా ఎదగాలని.. నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ అధివృద్ధిపై ప్రత్యేక దృష్టితో ముందుకెళ్తున్నామని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు వేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని చెరువులు, కాలువల శుద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌, చుట్టు పక్కల ప్రాంతాలు (జీహెచ్‌ఎంసీ సహా ఓఆర్‌ఆర్‌ పరిధిలో) 1,950 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే)ల మురికి నీరు ఉత్పత్తి అవుతుందన్నారు. జీహెచ్‌ఎంసీ వరకు చూస్తే దాదాపు 1,650 ఎంఎల్‌డీ మురికి నీరు ఉత్పత్తి అవుతోందని చెప్పారు. అయితే హైదరాబాద్‌లో ప్రస్తుతం 772 ఎంఎల్‌డీలను శుద్ధి చేసే సామర్థ్యంతో వివిధ ప్రాంతాల్లో 25 సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌ (ఎస్‌టీపీ) పని చేస్తున్నాయన్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లోని మరో 31 ప్రాంతాల్లో ఎస్‌టీపీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రూ. 3,866 కోట్లు మంజూరు చేస్తూ జీవో 669ని జారీ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని