ప్లాట్‌నం.17 బిడ్‌పై మధ్యంతర ఉత్తర్వులు

తాజా వార్తలు

Updated : 17/07/2021 17:41 IST

ప్లాట్‌నం.17 బిడ్‌పై మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌: ఖానామెట్‌ ప్లాట్‌ నం.17 బిడ్‌పై తుది నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్లాట్‌ నంబర్‌ 17లో వేలం ఆపాలని నలుగురు స్థానికులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ భూముల్లో తమ పూర్వీకుల సమాధులు ఉన్నాయని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ప్లాట్‌ నంబర్‌ 17కి సంబంధించి ప్రస్తుత స్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తుది ఉత్తర్వులకు లోబడి వేలం ఉండాలని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థను (టీఎస్‌ఐఐసీకి)ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని