ప్రాణాలు విలువైనవా?ఎన్నికలా?: హైకోర్టు

తాజా వార్తలు

Updated : 29/04/2021 14:48 IST

ప్రాణాలు విలువైనవా?ఎన్నికలా?: హైకోర్టు

ఎస్‌ఈసీ, ప్రభుత్వం తీరుపై అసహనం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై  తెలంగాణ హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తంచేసింది. కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. మినీ పుర పోరు నిర్వహణపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి లేదా అని ప్రశ్నించింది. కరోనా నియంత్రణపై ప్రభుత్వ తీరునూ తప్పుబట్టింది. రేపటితో రాత్రిపూట కర్ఫ్యూ ముగుస్తుంది.. తర్వాత చర్యలేంటని న్యాయస్థానం ప్రశ్నించగా.. పరిస్థితిని సమీక్షించి రేపు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం సమాధానమిచ్చింది. దీనిపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. ‘‘చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు? నియంత్రణ చర్యలపై దాగుడు మూతలెందుకు? కనీసం ఒకరోజు ముందు చెబితే నష్టమేంటి? కట్టడి చర్యలపై మేం ఎలాంటి సూచనలూ ఇవ్వడం లేదు. క్షేత్ర స్థాయి పరిస్థితులు చూసి నిర్ణయం తీసుకోండి’’ అని సూచించింది. దీనిపై స్పందించిన ఏజీ ప్రసాద్‌.. ప్రభుత్వాన్ని సంప్రదించి మధ్యాహ్నంలోగా చెబుతామన్నారు.

భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా?

మరోవైపు, కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారని కోర్టు ఎస్‌ఈసీని ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? అని అడిగింది. యుద్ధం వచ్చినా.. ఆకాశం మీదపడినా ఎన్నికలు జరగాల్సిందేనా? ఎస్‌ఈసీ అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తున్నారా? అధికారులు భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. కొన్ని మున్సిపాలిటీలకు ఇంకా సమయం ఉంది కదా అని హైకోర్టు అడగ్గా.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహించినట్టు ఎస్‌ఈసీ అధికారులు తెలిపారు. దీంతో కరోనా రెండో దశ మొదలైనా నోటిఫికేషన్‌ ఎందుకు ఇచ్చారంటూ కోర్టు మండిపడింది. ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి లేదా? ఎన్నికల ప్రచారం సమయం కూడా ఎందుకు కుదించలేదంటూ అసహనం వ్యక్తంచేసింది. అధికారులు కరోనా కట్టడిని వదిలేసి ఎన్నికల పనుల్లో ఉండే పరిస్థితి ఉందంటూ మండిపడింది. ఎస్‌ఈసీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని.. అధికారులు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని