E-Voting: ఈ-ఓటింగ్‌ సఫలం

ప్రధానాంశాలు

E-Voting: ఈ-ఓటింగ్‌ సఫలం

55.56 శాతం పోలింగ్‌ నమోదు..
ప్రయోగం విజయవంతం
యాప్‌లో నమూనా ఓటు హక్కు వినియోగించుకున్న 2,128 మంది

ఈటీవీ, ఖమ్మం: దేశంలోనే తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ-ఓటింగ్‌ ఖమ్మం నగరంలో విజయవంతంగా ముగిసింది. మొబైల్‌ యాప్‌ ద్వారా నమూనా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. మొత్తం 55.56 శాతం పోలింగ్‌ నమోదైంది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన నమూనా పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు సాగింది.  తొలి నాలుగు గంటల్లో వెయ్యి మంది ఓటేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 1,680, 3 గంటల వరకు 1,940, సాయంత్రం 5 గంటల వరకు 2,128 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 3,830 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

ఆల్ఫా, బీటా, గామా, నోటాలతో నాలుగు గుర్తులు
మొబైల్‌ యాప్‌లో తెలుగు, హిందీలో వివరాలు పొందుపరిచారు. ఆల్ఫా, బీటా, గామా, నోటా పేర్లు, వాటి పక్కనే గుర్తులు ఉండేలా బ్యాలెట్‌ పొందుపరిచారు. చిన్నపాటి సమస్యలు మినహా అంతా సజావుగానే సాగింది. యాప్‌ ఓపెన్‌ చేశాక కేవలం రెండు మూడు నిమిషాల్లోనే ఓటింగ్‌ ప్రక్రియ అంతా పూర్తయింది. ఈ-ఓటు వేసేందుకు కొందరు ప్రయత్నించినప్పటికీ సెల్‌ ఫోన్‌లలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. పలువురికి యాప్‌ ఓపెన్‌ కాలేదు. యాప్‌ను రీలోడ్‌ చేసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ‘‘ప్రజలకు అవగాహన కల్పిస్తే మరింత ప్రయోజనం ఉండేది. సరైన ప్రచారం లేకపోవడం వల్ల ఎన్నికల సంఘం ఆశించిన స్థాయిలో ఈ-ఓటింగ్‌లో ఓటర్లు పాల్గొనలేకపోయారుత. ప్రస్తుతం ఈ-ఓటులో నమోదైన ఫలితాలు, సాంకేతిక సమస్యలు, ఇతర ఇబ్బందులను అధిగమించాల్సిన అవసరం ఉంది’’ అని ఒక అధికారి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని