Inter Hall Tickets: నేటినుంచి వెబ్‌సైట్‌లో ఇంటర్‌ హాల్‌టికెట్లు

ప్రధానాంశాలు

Inter Hall Tickets: నేటినుంచి వెబ్‌సైట్‌లో ఇంటర్‌ హాల్‌టికెట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను మంగళవారం నుంచి ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచుతామని, సాయంత్రం 5 గంటల నుంచి వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకొని ఈ నెల 25వ తేదీ నుంచి మొదలయ్యే పరీక్షలకు హాజరుకావొచ్చని ఆయన పేర్కొన్నారు. వాటిలో తప్పులు ఉంటే కళాశాల ప్రిన్సిపల్‌ లేదా జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. హాల్‌టికెట్లపై ప్రిన్సిపల్‌ సంతకం లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని చీఫ్‌ సూపరింటెండెంట్లకు బోర్డు కార్యదర్శి సూచించారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని