24 గంటల్లో 108 మరణాలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

24 గంటల్లో 108 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో తొలి, రెండో దశలో ఇవే అత్యధికం
మరో 20,345 మందికి కరోనా

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. 24 గంటల్లో 108 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తొలి, రెండో దశలో ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని మరణాలు నమోదవటం ఇదే తొలిసారి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 20,345 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ కాలవ్యవధిలో 86,878 నమూనాలు పరీక్షించగా... 23.41 శాతం మంది వైరస్‌ ఉన్నట్లు తేలింది. మొత్తం కేసుల సంఖ్య 13,22,934కు, మరణాలు 8,899కు చేరాయి. క్రియాశీలక కేసులు రెండు లక్షలకు చేరువలో (1,95,102) ఉన్నాయి.

52.15 శాతం కేసులు ఆ 5 జిల్లాల్లోనే
24 గంటల వ్యవధిలో నమోదైన కేసుల్లో 10,610 (52.15 శాతం) చిత్తూరు, విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కడప జిల్లాల్లోనే వచ్చాయి. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో క్రియాశీలక కేసులు పెరుగుతున్నాయి. ఈ రెండూ జిల్లాల్లోనూ 20 వేలకు పైగా క్రియాశీలక కేసులున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,75,14,937 నమూనాలు పరీక్షించారు. తాజాగా 14,502 మంది కోలుకున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని