‘కొవాగ్జిన్‌’ సాంకేతికతను బదిలీ చేయాలి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కొవాగ్జిన్‌’ సాంకేతికతను బదిలీ చేయాలి

పేటెంట్‌, మేధో హక్కులు అడ్డంకి కాబోవు
ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ లేఖ

ఈనాడు, అమరావతి: ‘‘దేశ అవసరాలకు అనుగుణంగా కొవాగ్జిన్‌ ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా ఆ సాంకేతికతను దేశంలో వ్యాక్సిన్‌ తయారీకి సిద్ధంగా ఉన్న ఫార్మా కంపెనీలకు బదిలీ చేసేలా భారత్‌ బయోటెక్‌కు సూచించాలి. కొవాగ్జిన్‌ ఉత్పత్తి చేసేందుకు ఇతర ఫార్మా సంస్థలకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించాలి. ఆ సాంకేతికతను అందుకు ఉపయోగపడే మేధోపరమైన హక్కులను బదలాయించేలా చూడాలి’’ అని ప్రధానమంత్రి మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మంగళవారం లేఖ రాశారు.  ‘‘కొవాగ్జిన్‌ టీకా ఉత్పాదక సామర్థ్యం ప్రస్తుత దేశ అవసరాలను తీర్చలేదని తెలిసింది. ఇదే వేగంతో ఉత్పత్తి చేస్తే టీకాలు వేయడానికి చాలా కాలం పడుతుంది. అందుకే ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా ఆసక్తి ఉన్న వారికి ఆ సాంకేతికతను బదిలీ చేయాలి. ఇందుకు మేధో ఆస్తి హక్కులు(ఐపీఆర్‌), పేటెంట్లు వంటివి అడ్డంకి కాబోవు’ అని జగన్‌ తన లేఖలో పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని