తిరుమలేశుని ఏకాంతసేవలోసుప్రీంకోర్టు సీజే ఎన్‌వీ రమణ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుమలేశుని ఏకాంతసేవలోసుప్రీంకోర్టు సీజే ఎన్‌వీ రమణ

సతీసమేతంగా శ్రీవారి దర్శనం

ఈనాడు, తిరుపతి- న్యూస్‌టుడే, తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం రాత్రి 8.50 సమయంలో స్వామిని దర్శించుకున్న అనంతరం ఏకాంతసేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనార్థం గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న జస్టిస్‌ రమణకు శ్రీ పద్మావతి అతిథిగృహం వద్ద తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తితిదే ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. వీరితోపాటు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలితకుమారి, జిల్లా జడ్జి రవీంద్రబాబు, తిరుపతి అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు, ప్రోటోకాల్‌ మేజిస్ట్రేట్‌్ పవన్‌కుమార్‌ తదితరులు ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం కొద్దిసేపు శ్రీపద్మావతి అతిథిగృహంలో విశ్రాంతి తీసుకుని.. శ్రీవారి దర్శనార్థం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు తితిదే ఛైర్మన్‌, ఈవో, అదనపు ఈవో స్వాగతం పలికారు. జస్టిస్‌ ఎన్‌వీ రమణతో పాటు ఆయన భార్య శివమాల స్వామివారి దర్శనం, ఏకాంతసేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం జస్టిస్‌ ఎన్‌వీ రమణ శ్రీపద్మావతి అతిథిగృహానికి వెళ్లారు. శుక్రవారం ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు బయల్దేరి వెళతారు.

మర్యాదపూర్వకంగా కలిసిన భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, ఎండీ
తిరుమలకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణను భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లతో పాటు ఎండీ సుచిత్ర ఎల్ల మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమలలోని శ్రీపద్మావతి అతిథి గృహం వద్ద ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. గురువారం రాత్రి వారు శ్రీవారిని దర్శించుకున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని