ఎంపీ మాలోత్‌ కవితకు జైలుశిక్ష, జరిమానా

ప్రధానాంశాలు

ఎంపీ మాలోత్‌ కవితకు జైలుశిక్ష, జరిమానా

ఆమె అభ్యర్థన మేరకు బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవితకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు 6 నెలల జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ శనివారం తీర్పు వెలువరించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినట్లు బూర్గంపహాడ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమె అనుచరుడు షౌకత్‌ అలీ ఓటర్లకు డబ్బులు పంచుతూ ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు పట్టుబడ్డాడు. ఈ కేసులోనే కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఎంపీ కవిత వెంటనే రూ.10 వేల జరిమానా చెల్లించారు. ఆమె అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని