ఇది ఎన్నికల కోసం కాదు..

ప్రధానాంశాలు

ఇది ఎన్నికల కోసం కాదు..

రెండో విడత గొర్రెల పంపిణీలో మంత్రి తలసాని

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: తమది మాటల ప్రభుత్వం కాదని, ముమ్మాటికీ చేతల ప్రభుత్వమని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. బుధవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో.. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని గొల్లకుర్మలకు రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది ఎన్నికల కోసం చేస్తున్నది కాదని.. కరోనా, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మలివిడత పంపిణీ ఆలస్యమైందని చెప్పారు. గొల్ల కుర్మల ఆరాధ్య దేవుళ్లయిన మల్లన్న, బీరన్నల స్వరూపమే కేసీఆర్‌ అని మంత్రి వ్యాఖ్యానించారు. రెండో విడతలో రూ.6 వేల కోట్లతో గొర్రెలని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో గొర్రెల సంపద విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లోనే చెప్పిందని వెల్లడించారు. ‘‘భాజపా, కాంగ్రెస్‌ నాయకులు ఇన్నేళ్లల్లో ప్రజలకు చేసిందేమీ లేదు. కొందరు దొంగ ఏడుపులతో ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం పేరిట ఆటలాడుతున్నారు. వారు గెలిచినా రాష్ట్రంలో రెండు నుంచి మూడుకు వాళ్ల ఎమ్మెల్యేలు పెరగొచ్చు. కానీ ఇక్కడి ప్రజలకు ఏమీ ఒరగదు. అభివృద్ధే మంత్రంగా పనిచేస్తున్న తెరాసకు వచ్చే ఎన్నికలో పట్టం కట్టాలి’’ అని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, జడ్పీ ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ తదితరులు పాల్గొన్నారు. 500 మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని