హైకోర్టులో 9 నుంచి ప్రత్యక్ష విచారణ

ప్రధానాంశాలు

హైకోర్టులో 9 నుంచి ప్రత్యక్ష విచారణ

  టీకా వేయించుకుంటేనే అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతోపాటు బార్‌ అసోసియేషన్‌ల అభ్యర్థనల మేరకు హైకోర్టులో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు ఈ నెల 9వ తేదీ నుంచి సెప్టెంబరు 9 వరకు ప్రయోగాత్మకంగా కేసుల ప్రత్యక్ష విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. దీని ప్రకారం.. రోజుకు ఒక డివిజన్‌ బెంచ్‌, ముగ్గురు సింగిల్‌ జడ్జీలతో కూడిన బెంచ్‌లు భౌతిక విచారణ చేపడతాయి. కేసు విచారణలో ఉన్న న్యాయవాదులు, పార్టీ ఇన్‌ పర్సన్‌లను మాత్రమే కోర్టు ఆవరణలోకి అనుమతిస్తారు. టీకా వేయించుకున్న వారికే అనుమతి ఉంటుంది. కోర్టుకు వచ్చిన వారు తప్పనిసరిగా మాస్కులు ధరించి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఎవరైనా ఆందోళనకు దిగితే భౌతిక విచారణ ప్రక్రియను నిలిపివేస్తామన్నారు. కింది కోర్టుల్లో కూడా సెప్టెంబరు 9వ తేదీ వరకు ఇప్పటి మాదిరిగానే కేసుల భౌతిక విచారణలు కొనసాగుతాయని, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విచారణ సాగిస్తున్న ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ కోర్డులు ఈ నెల 8 నుంచి భౌతిక విచారణ చేపడతాయని స్పష్టం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని